Manoharabad MPDO arrest : మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీవో జైపాల్‌రెడ్డికి అనిశా ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసిన అధికారులు.. హైదరాబాద్‌లోని అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ కోసం చంచల్‌గూడ జైలుకు తరలించారు. జనవరి 11న ఉదయం నుంచి జైపాల్‌రెడ్డి ఇంటితో పాటు... మనోహరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.
ఎంపీడీవో వద్ద రూ.3.4 కోట్ల ఆస్తులు గుర్తింపు... 14 రోజుల రిమాండ్.. - Manoharabad MPDO Arrest
Manoharabad MPDO arrest : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మెదక్ జిల్లా మనోహరబాద్ ఎంపీడీవో జైపాల్‌రెడ్డికి అనిశా ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. జైపాల్‌రెడ్డిని అనిశా అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
![ఎంపీడీవో వద్ద రూ.3.4 కోట్ల ఆస్తులు గుర్తింపు... 14 రోజుల రిమాండ్.. 14Days Remand For Manoharabad MPDO jaipalreddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14169818-970-14169818-1641996567987.jpg)
నిజామాబాద్ రేంజ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయిన అనిశా అధికారులు.. మనోహరాబాద్ ఎంపీడీఓ కార్యాలయం, మేడ్చల్ సూర్యనగర్‌లోని జైపాల్‌రెడ్డి నివాసంతో పాటు మరో రెండు చోట్ల సోదాలు చేశారు. జైపాల్‌రెడ్డికి చెందిన 3 బ్యాంకు లాకర్లను పరిశీలించారు. మొత్తం రూ.3.4 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు అనిశా అధికారుల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. స్థిర, చరాస్తులతో పాటు బంగారం, నగదును అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైపాల్‌రెడ్డిపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అనిశా అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం..