తెలంగాణ

telangana

ETV Bharat / crime

రియల్టర్ల హత్య కేసులో ఐదుగురు నిందితులకు రిమాండ్​.. - firing on realters in hyderabad

14 days remand for Five accused in realtors' murder case
14 days remand for Five accused in realtors' murder case

By

Published : Mar 4, 2022, 9:53 PM IST

Updated : Mar 4, 2022, 10:25 PM IST

21:43 March 04

రియల్టర్ల హత్య కేసులో ఐదుగురు నిందితులకు రిమాండ్​..

Telangana Realtors Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన స్థిరాస్తి వ్యాపారులపై కాల్పుల కేసులో అరెస్టయిన నిందితులకు ఇబ్రహీంపట్నం కోర్టు రిమాండ్​ విధించింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా.. ఐదుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్​ను న్యాయస్థానం​ విధించింది. భూవివాదం కారణంగా మట్టారెడ్డే ప్రధాన సూత్రధారిగా ఈ హత్యలు చేయించినట్టు పోలీసులు వెల్లడించారు. బిహార్‌లో ఆయుధాలు కొని శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిని అంతమొందించినట్లు దర్యాప్తులో తేలిందని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

కాల్పుల్లో ఇద్దరు చనిపోవడంతో ప్రత్యేక కేసుగా భావించిన పోలీసులు... 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. కాల్పుల ఘటనపై పథక రచన మొత్తం మట్టారెడ్డిదేనని.. స్థిరాస్తి వ్యాపారులపై భిక్షపతి, మోహియుద్దీన్ కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. తొలుత విచారణలో మట్టారెడ్డి సహకరించలేదని.. అన్ని ఆధారాలు చూపించాకా నిజం ఒప్పుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 4, 2022, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details