Today Road Accident: మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గేదెను తప్పించే ప్రయత్నంలో రోడ్డు కిందకు దూసుకుపోయింది. ఘటనలో బస్సు నుజ్జునుజ్జయింది. 13 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు.
గేదెను తప్పించబోయి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 13 మందికి గాయాలు - 13 members were injured in road accident
Today Road Accident: మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం తప్పింది. గేదెను తప్పించే క్రమంలో రోడ్డు కిందకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు.. పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. చెట్టును ఢీ కొట్టి ఆగిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కామారెడ్డి డిపోకు చెందిన ఈ బస్సు.. భద్రాచలం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గేదెను రక్షించడం కోసం బస్సును తప్పించగా.. ప్రమాదంలో అది మృతి చెందింది. బస్సు వేగంగా రోడ్డు కిందకు దూసుకెళ్లి.. ఓ చెట్టును ఢీ కొట్టి ఆగిపోయిందని ప్రయాణికులు పేర్కొన్నారు. లేదంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని భయాందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:రైలెక్కి సెల్ఫీ తీసుకుంటుండగా.. బాలుడికి విద్యుత్ షాక్