తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape on minor girl: బహిర్భూమికి వెళ్లిన మైనర్​ బాలికపై కామాంధుడి అత్యాచారం - 12 ఏళ్ల బాలికపై అత్యాచారం క్రైం వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

12-year-old-girl-raped-in-anantapur-district
12-year-old-girl-raped-in-anantapur-district

By

Published : Sep 10, 2021, 10:28 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు రమేశ్‌(42)పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను కొంతకాలంగా అనుసరిస్తున్న నిందితుడు రమేశ్‌.. శుక్రవారం రోజున... బాలిక బహిర్భూమికి వెళ్లిన సమయంలో వెంబడించి నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రమేశ్‌ నాటుసారా విక్రయిస్తూ.. జీవనం సాగిస్తుంటాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details