తెలంగాణ

telangana

ETV Bharat / crime

జూబ్లీహిల్స్​ ఘటన మరవక ముందే.. 11 ఏళ్ల బాలిక కిడ్నాప్.. ఇద్దరు అరెస్ట్​ - mughulpura kidnap case

హైదరాబాద్​ మొఘల్​పురాలో 11 ఏళ్ల బాలిక కిడ్నాప్
హైదరాబాద్​ మొఘల్​పురాలో 11 ఏళ్ల బాలిక కిడ్నాప్

By

Published : Jun 5, 2022, 10:18 AM IST

Updated : Jun 5, 2022, 4:25 PM IST

10:16 June 05

జూబ్లీహిల్స్​ ఘటన మరవక ముందే.. 11 ఏళ్ల బాలిక కిడ్నాప్.. ఇద్దరు అరెస్ట్​..

హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే.. మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 4 రోజుల క్రితం మొఘల్‌పురాలో 11 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. గత నెల 31వ తేదీన బాలిక ఒంటరిగా తన బంధువుల ఇంటికి వెళ్తుండగా.... తాను కూడా అటే వెళ్తున్నానని మాయమాటలు చెప్పి క్యాబ్​ డ్రైవర్ లుక్మాన్​ తన కారులో ఎక్కించుకున్నాడు. స్నేహితుడితో కలిసి బాలికను కిడ్నాప్​ చేశాడు. బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గు అనే గ్రామానికి తీసుకెళ్లాడు.

మూడో తేదీ ఉదయం మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సుల్తాన్ షాహిలో బాలికను వదిలి పారిపోయాడు. 4 రోజుల నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబీకులు అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ సాగుతున్న సమయంలోనే బాలిక కనిపించడంతో వివరాలు ఆరా తీశారు. వెంటనే రంగంలోకి దిగిన మొఘల్​పురా పోలీసులు.. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా క్యాబ్‌ డ్రైవర్‌ లుక్మాన్‌, అతడి స్నేహితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితులకు ఆశ్రయం కల్పించిన వారి వివరాల గురించి కూపీ లాగుతున్నారు. బాలికపై అత్యాచారం జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి..

Jubileehills gang rape: అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

Last Updated : Jun 5, 2022, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details