గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న జశ్వంత్ అనే 11 నెలల బాలుడిని ఓ కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని.. కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించగా.. చికిత్స పొందుతూ ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
కారు ఢీకొట్టిన ఘటనలో బాలుడు మృతి
గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారి.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
boy was killed in a car crash
బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. కారు డ్రైవర్ తాటి కిరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:పెళ్లి చేసుకుంటానని పంజాబ్ తీసుకెళ్లి..