ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై చనిపోయి ఉన్న గేదెను తప్పించబోయిన టాటాఏస్ వాహనం.. కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Road accident news today: గేదెను తప్పించబోయి ప్రమాదం.. 11మందికి తీవ్రగాయాలు - తెలంగాణ వార్తలు
రోడ్డుపై చనిపోయిన ఉన్న గేదెను తప్పించబోయిన ఓ టాటాఏస్ వాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ దుర్గగుడికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
కారు యాక్సిడెంట్, రోడ్డు ప్రమాదం
హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులు జనగామ జిల్లా నుంచి.. విజయవాడ దుర్గగుడికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:Hyderabad Hotel news: ఓ హోటల్ నిర్వాకం.. మటన్‌లో బూజు.. చికెన్‌లో పురుగులు!