ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరిలో విషాదం చోటు చేసుకుంది. యువకుడి వేధింపులతో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సాయి అనే యువకుడు ఇంటి ముందు ఉండే విద్యార్థినిని తరచూ ప్రేమ పేరుతో వేధిస్తుండే వాడు. బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. వారు మందలించినా అతనిలో మార్పు రాలేదు. ఈ నెల 9వ తేదీన పాఠశాలకు వెళ్లి వస్తున్న ఆమెను మళ్లీ యువకుడు వేధింపులకు గురిచేశాడు. ప్రేమించమంటూ వేధించాడు. సాయి వేధింపులు తాళలేక విద్యార్థిని ఇంట్లోకి వెళ్లి పురుగులమందు తాగింది.
యువకుడి వేధింపులు తాళలేక... 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య - student commits suicide after being harassed by a teenager
ప్రేమించమంటూ ఓ యువకుడు బాలికను వేధింపులకు గురిచేశాడు. విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పి మందలించిన యువకుడిలో మార్పు రాలేదు. విసుగు చెందిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
గమనించిన కుటుంబసభ్యులు బాలికను ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమం కావడంతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. యువకుడిపై ఖమ్మం గ్రామీణ పీఎస్‌లో విద్యార్థిని బంధువులు ఫిర్యాదు చేశారు. యువకుడు సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Acid Attack: అనుమానమే పెనుభూతం- భార్యపై యాసిడ్ దాడి
Last Updated : Sep 11, 2021, 12:37 PM IST