తెలంగాణ

telangana

ETV Bharat / crime

పదో తరగతి బాలుడు సూసైడ్​.. ఇన్​స్టాగ్రాం బయో చూసి అందరు షాక్​​..!

10th Class Student Suicide: పొద్దున్నే తన స్నేహితునికి ఇన్​స్టాగ్రాంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతలోనే.. ఇంట్లో విగతజీవిగా ఫ్యాన్​ను వేలాడుతూ కనిపించాడు. ఇది తెలిసి తన స్నేహితులు.. తను చివరిగా ఇన్​స్టాగ్రాంలో పంపించిన బర్త్​డే మెస్సేజ్​ చూస్తూ బాధపడుతుండగా.. విస్తూపోయే విషయం వెలుగుచూసింది. అదేంటంటే..

10th Class Student Suicide with writing death date in Instagram bio before suicide
10th Class Student Suicide with writing death date in Instagram bio before suicide

By

Published : Jul 20, 2022, 11:02 PM IST



10th Class Student Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 9వ వార్డుకు చెందిన శివలోకేశ్​(14) అలియాస్​ సోనూ పదో తరగతి చదువుతున్నాడు. తండ్రి రవి స్థానికంగా టెంట్​హౌస్ నడుపుతుంటాడు. అయితే.. ఈరోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. శివలోకేశ్​ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటివరకు బయటకు వెళ్లిన తాత ఇంటికి వచ్చి చూసేసరికి.. లోకేశ్​ ఫ్యాన్​ను వేలాడుతూ కనిపించాడు. వెంటనే అక్కడున్న స్థానికులు సాయంతో.. లోకేశ్​ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్టు తెల్చారు. లోకేశ్​ మృతి వార్త విని కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. కుటుంబసభ్యులతో పాటు.. లోకేశ్​ స్నేహితులు సైతం తీవ్రంగా బాధపడ్డారు.

అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే లోకేశ్​.. ఆత్మహత్యకు ముందు తన మిత్రుడు గౌతమ్​కు ఇన్​స్టాగ్రాంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాసేపటికే చనిపోయాడన్న వార్త వినేసరికి.. స్నేహితుల గుండె అవిసిపోయింది. లోకేశ్​ పంపించిన మెస్సేజ్​ను చూసుకుంటూ బాధపడుతున్న స్నేహితులు.. తనను తలుచుకుంటూ ఇన్​స్టాగ్రాం ఫ్రొఫైల్​ చూశారు. ఇన్​స్టాగ్రాంలో పెట్టిన తన ఫోటోలను చూస్తూ.. తనతో ఉన్న అనబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇంతలో.. బయోలో రాసిన విషయాన్ని చదివి ఒక్కసారిగా షాక్​ అయ్యారు. బయోలో తన మరణతేది 20 జులైగా రాసి ఉండటాన్ని చూసి.. ఒక్కక్షణం అవాక్కవటం స్నేహితుల వంతైంది. అంటే.. తాను చనిపోవాలని ముందే నిర్ణయించుకుని.. దాని కోసం తేదీని కూడా ఎంచుకుని.. ఈ విషయాన్ని సామాజికమాధ్యమంలో రాసుకోవటం.. ఓవైపు అందరిని విస్తుపోయేలా చేస్తే.. మరోవైపు మనసుల్ని కలచివేసింది.

ఇన్​స్టాగ్రాం బయోలో మరణతేదీ

అయితే బాలుడి ఆత్మహత్యకు సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే.. బాలుడు సోషల్​ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉండటం వల్ల.. మృతికి సెల్​ఫోన్​ కొనివ్వకపోవడమే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details