Electric Shock: జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతం.. విద్యార్థి మృతి - ఏపీ నేరవార్తలు

16:06 August 25
జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతం.. విద్యార్థి మృతి
ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరంలో విషాదం చోటుచేసుకొంది. జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతిచెందారు. మృతుడు పదో తరగతి విద్యార్థి గోపీచంద్ (15) గా గుర్తించారు.
పాఠశాలలోని వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు గోపీచంద్‌ను ఎక్కించారని బంధువులు ఆరోపించారు. వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగానే షాక్ తగిలి గోపిచంద్ మృతిచెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విద్యార్థి బంధువులు ఆందోళన చేపట్టారు.