పిడుగుపాటుకు గురై 10 గొర్రెలు మృతిచెందిన ఘటన... ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో చోటుచేసుకుంది. పేరూరు గ్రామానికి చెందిన యాదడ్ల సమ్మయ్య అనే వ్యక్తి బుధవారం గ్రామ శివారులో తన గొర్రెలను మేపుతున్నాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతో పాటు గొర్రెల సమీపంలో పిడుగు పడింది.
పిడుగు పాటుకు గురై గొర్రెలు మృతి.. రూ.1 లక్షకు పైగా నష్టం - Mulugu district latest news
ములుగు జిల్లా వాజేడు మండలంలో బుధవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో పేరూరు గ్రామ శివారులో పిడుగు పడడంతో 10 గొర్రెలు మత్యువాతపడ్డాయి.
పిడుగుపాటుతో 10 గొర్రెలు మృతి
ఈ క్రమంలో అక్కడికక్కడే 10 గొర్రెలు మృతిచెందినట్లు బాధితుడు సమ్మయ్య తెలిపారు. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని అన్నారు. తనకు నష్టపరిహారం అందించి... ప్రభుత్వం అదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: Corona: మరో 54వేల కేసులు.. 1,321 మరణాలు