Kadapa Crime News: ఏపీలోని కడప జిల్లా పోరుమామిళ్లలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నెపంతో షేక్‌మున్నీ అనే మహిళపై కొంతమంది కర్రలతో దాడి చేశారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కడప రిమ్స్‌కి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందింది. ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోరుమామిళ్ల పోలీసులు.. 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. మున్నీ హత్య ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్టు సమాచారం.
అదే కారణమా..?: ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్‌మున్నీ.. గత ఏడాదిగా పోరుమామిళ్లలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. పని నిమిత్తం పోరుమామిళ్లకు వచ్చి వెళ్లేది. అయితే ఆమె పనిచేసే సూపర్ మార్కెట్‌కు ముగ్గురు యజమానులు ఉన్నారు. వారిలో ఒకరితో మున్నీ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో అతని కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి షేక్మున్నీపై దాడికి పాల్పడ్డారు. మున్నీని గిద్దలూరు నుంచి ఓ వాహనంలో కొట్టుకుంటూ తీసుకొచ్చి కడప రిమ్స్‌లో చేర్చారు.