మహబూబ్నగర్ జిల్లా గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గుట్కాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బీకే రెడ్డి కాలనీలో పెద్దఎత్తున నిషేధిత గుట్కాను నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. రూ.10 లక్షల విలువైన గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రూ.10 లక్షల విలువైన గుట్కా స్వాధీనం.. ఒకరు అరెస్టు - MAHABUBNAGAR DISTRICT LATEST NEWS
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రూ.10 లక్షల విలువైన గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకుని వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
రూ.10 లక్షల విలువైన గుట్కా స్వాధీనం.. ఒకరు అరెస్టు
జడ్చర్ల గౌరీశంకర్ కాలనీకి చెందిన వ్యాపారి మహమ్మద్ సలీం ఈ వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాడులలో స్వాధీనం చేసుకున్న గుట్కా బస్తాలతో పాటు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మహబూబ్నగర్ గ్రామీణ పోలీస్ స్టేష్న్లో అప్పగించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ రీఓపెన్