నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన కూలీలు మిర్చి ఏరివేతకు వెళ్లి ఆటోలో తిరిగివస్తుండగా... మార్గమధ్యలో దామరచర్ల వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. దీనితో ఆటోలో ప్రయాణిస్తున్న 10మంది కూలీలకు గాయాలయ్యాయి.
ఆటో, లారీ ఢీ.. 10 మందికి గాయాలు - Auto, Larry accident latest news
నల్గొండ జిల్లా, దామరచర్ల మండల కేంద్రంలో కూలీలతో వెళ్తున్న ఆటో, లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి.
ఆటో, లారీ ఢీ.. 10 మందికి గాయాలు
వారిని స్థానికులు 108లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Mar 2, 2021, 11:36 AM IST