తెలంగాణ

telangana

ETV Bharat / crime

పంట రుణాల కుంభకోణం.. పోలీసుల అదుపులో 10 మంది - పెద్దపల్లి జిల్లా లేటెస్ట్​ వార్తలు

10 arrested in crop loan scam in peddapalli district
పంట రుణాల కుంభకోణం.. పోలీసుల అదుపులో 10 మంది

By

Published : Feb 5, 2021, 12:30 PM IST

Updated : Feb 5, 2021, 1:16 PM IST

12:28 February 05

పంట రుణాల కుంభకోణం.. పోలీసుల అదుపులో 10 మంది

పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు పంట రుణాల కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ముత్తారం మండలంలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో రుణాలను తీసుకున్న కొంత మంది బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారు. 

జిల్లాలోని రామగిరి, ముత్తారం మండలాలకు చెందిన 153 మంది 2016 సంవత్సరం నుంచి 2018 వరకు బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నారు. రుణాలు చెల్లించకపోవటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఒక్కరు కూడా తిరిగి చెల్లించకపోవటంతో విచారణ చేపట్టారు. కొవిడ్​ కారణంగా ఆలస్యమైన దర్యాప్తులో నిందితులు ఇచ్చిన పుస్తకాలు నకిలీవిగా గుర్తించారు.

రెవెన్యూ అధికారి ఇచ్చిన సమాచారంతో.. గ్రామీణ బ్యాంకు అధికారులు నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి పంట రుణాలు తీసుకున్న వారి వద్దకు వెళ్లి విచారించారు. మొత్తంగా రూ. 1 కోటి 99 లక్షల 89 వేల 714 రూపాయలు మోసం చేశారని నిర్ధరణ చేసుకున్నారు. గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు 153 మంది రైతులపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:ఆంధ్రాలో అపహరణకు గురైన సర్పంచ్​ అభ్యర్థి క్షేమం!

Last Updated : Feb 5, 2021, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details