హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని అంబేడ్కర్ నగర్లో అర్ధరాత్రి చోరీ చేశారు. ఇంటి కిటికీలు విరగొట్టి లోనికి చొరబడ్డ దుండగులు... 80 వేల రూపాయలను దోచుకెళ్లారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ ఇంటికి చేరుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా తమ సొంతూరికి వెళ్లామని... తిరిగొచ్చేలోపే ఇంట్లో దొంగలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు...
ఎన్నో రోజులుగా కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆగంతకులు ఎత్తుకెళ్లడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడడం రికార్డయిందని... త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.