ఓరుగల్లుకు చెందిన రచయితను కాళోజీ నారాయణ అవార్డు వరించింది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే ఈ అవార్డు వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, కవి రామాచంద్రమౌళిని వరించింది. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందించనుంది.
ఓరుగల్లు రచయితను వరించిన కాళోజీ నారాయణ అవార్డు - writer ramachandramaouli got kaloji award
రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే ప్రతిష్ఠాత్మక అవార్డు ఈసారి ఓరుగల్లుకు చెందిన రచయితను వరించింది. వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత చంద్రమౌళికి.. ఈ నెల 9న అవార్డు అందించనున్నారు.

warangal writer got kaloji narayana award
వరంగల్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన రామా చంద్రమౌళి దీపశిఖ, స్మృతిధార, అంతర్దహనం, అంతర, అసంపూర్ణ సహా పలు రచనలు చేశారు. ఆయన రాసిన కాల నాళిక నవలతో తెలంగాణ ఉద్యమ పరిణామాన్ని ఆవిష్కరించారు. అవార్డుకు ఎంపికైన రామా చంద్రమౌళిని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.