తెలంగాణ

telangana

ETV Bharat / city

'మట్టిగణపతిని ప్రతిష్ఠించుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం' - warangal urban collector news

'మట్టిగణపతిని ప్రతిష్ఠించుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం' అంటూ వరంగల్​ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ పిలుపునిచ్చారు. వినాయకచవితిని పురస్కరించుకుని కలెక్టరేట్​లో మట్టి విగ్రహాలను కలెక్టర్​ పంపిణీ చేశారు.

'మట్టిగణపతిని ప్రతిష్ఠించుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం'
warangal urban collector distribute clay ganesh idols

By

Published : Aug 21, 2020, 10:45 PM IST

వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి గణపతినే పూజించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ పిలుపునిచ్చారు. వినాయక చవితిని కలెక్టరేట్​లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వెయ్యి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ సూచించారు. కొవిడ్ సందర్భంగా తమ తమ ఇళ్లలోనే పండుగను జరుపుకోవాలని కలెక్టర్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details