తెలంగాణ

telangana

ETV Bharat / city

ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, కమిషనర్ పర్యటన - వరంగల్​లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన నగర కమిషనర్

వరంగల్​లో నీట మునిగిన ప్రాంతాలను... నగర కమిషనర్​తో కలిసి కలెక్టర్​ పరిశీలించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.

ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, కమిషనర్ పర్యటన
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, కమిషనర్ పర్యటన

By

Published : Aug 17, 2020, 4:09 PM IST

వరంగల్ నగరంలో నీటమునిగిన కాలనీలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి ఖిలావరంగల్, సమ్మయ్య నగర్, ఎస్​ఆర్​నగర్, పద్మానగర్, మధుర నగర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కడిపికొండ రాజీవ్ గృహకల్ప కాలనీ పరిస్థితులు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, కమిషనర్ పర్యటన

ముంపు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. వరద ప్రవాహం తగ్గిన అనంతరం జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details