నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని వీధులన్నీ రంగవల్లికలతో కనువిందు చేస్తున్నాయి. మహిళలు వేకువజాము నుంచే ఇంటి ముంగిళ్లలో ముగ్గులను అందంగా తీర్చిదిద్దడంలో నిమగ్నమయ్యారు. 2020కి బైబై చెబుతూ 2021కి స్వాగతం పలికారు. నగరంలోని ప్రతి వీధిలో రంగురంగుల ముగ్గులు దర్శనమిస్తున్నాయి. పోటాపోటీగా ముగ్గులు వేసిన మహిళలు రంగులు అద్ది మరింత ఆకర్షణీయంగా మార్చారు.
ముచ్చటైన ముగ్గులతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం - తెలంగాణ వార్తలు
వరంగల్ నగరంలోని పలు వీధుల్లో ముచ్చటైన రంగవల్లులు అందరికీ కనువిందు చేస్తున్నాయి. 2020 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2021 కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ముగ్గులను మహిళలు అందంగా తీర్చిదిద్దారు. వేకువ జాము నుంచే నూతన సంవత్సర శోభ సంతరించుకుంది.
ముచ్చటైన ముగ్గులతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం
కరోనా వ్యాప్తి దృష్ట్యా బహిరంగ వేడుకలు జరుపుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆదేశాలివ్వడంతో కొందరు వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రతిసారి హన్మకొండలోని కిషన్పుర ప్రాంతల్లో విద్యార్థుల నృత్యాలు చేస్తూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. కానీ ఈ సారి కరోనా వల్ల వసతిగృహంలో విద్యార్థులు లేకపోవడంతో కల తప్పింది.
ఇదీ చూడండి: ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలి: సీపీ అంజనీకుమార్