రాష్ట్రంలో నీలి విప్లవం మొదలైందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలను పునరుద్ధరించుకున్నమని... అభివృద్ధి చెందిన చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌లోని రంగసముద్రంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌తో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు.
'కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేలా ప్రభుత్వ కృషి' - warangal latest news
వరంగల్‌లోని రంగసముద్రంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేపలు వదిలారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు బండ ప్రకాశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
'కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేలా ప్రభుత్వ కృషి'
మొదటి విడతలో 50 వేల చేప పిల్లలను చెరువులో వదిలినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం వల్ల ముదిరాజుల కుటుంబాలలో వెలుగులు నింపుతున్నామని తెలిపారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకురావాలని ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి:గోల్ బంగ్లాకు పూర్వ వైభవం.. ఫలించిన సీపీ ప్రయత్నం