కార్పొరేట్ శక్తులకు మోదీ సర్కార్ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతూ... రైతుల నడ్డి విరుస్తోందని వరంగల్ తూర్పు శాసనసభ్యులు నరేందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేసే దిశగా రైతు పెట్టుబడి, ఉచిత విద్యుత్, కాళేశ్వరం నీళ్లు అందిస్తుంటే... కేంద్రం మాత్రం కపట ప్రేమను చూపిస్తోందని ఎద్దేవా చేశారు.
'రైతులను రాష్ట్రం రాజును చేస్తే.. కేంద్రం నడ్డి విరుస్తోంది' - bharat bandh in warangal
రైతులకు మద్దతుగా ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ నిరసన చేపట్టారు. కార్యకర్తలతో కలిసి కోట నుంచి ర్యాలీ నిర్వహించారు.
warangal mla bjp fire on bjp government
కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులు ఉపసంహరించుకునే వరకు రైతులకు మద్దతుగా నిలుస్తామని వ్యాఖ్యానించారు. అంతకుముందు వరంగల్ కోట నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. రైతు వేషధారణలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ రైతులకు పూర్తి మద్దతు తెలిపారు.