వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల తీరు మారడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తూ రోగులను గాలికొదిలేస్తున్నారు. కొవిడ్ పరీక్షల కోసం వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన రోగులకు నిరాశే మిగులుతోంది. కరోనా నిర్ధరణ అయిన రోగులకు చికిత్స అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సకాలంలో వైద్యం అందించాల్సిన వైద్యులు... రోగులను ఏ మాత్రం పట్టించుకోవట్లేదు.
తీరు మార్చుకోని వైద్యులు... తీవ్ర ఇబ్బందుల్లో బాధితులు - తీరు మార్చుకోని వైద్యులు... తీవ్ర ఇబ్బందుల్లో బాధితులు
కరోనా బాధితులకు మెరుగైనా వైద్యం అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో గాలికొదిలేశారు. వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు
![తీరు మార్చుకోని వైద్యులు... తీవ్ర ఇబ్బందుల్లో బాధితులు warangal mgm hospital updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8262777-907-8262777-1596303673677.jpg)
warangal mgm hospital updates
ఆక్సిజన్ కోసం వైద్యులను బ్రతిమిలాడినా కనికరం చూపటం లేదని బాధితులు చెబుతున్నారు. కొవిడ్ వార్డులో రోగులకు అందుతున్న సేవలపై ఆసుపత్రి ఉన్నతాధికారులను సంప్రదించగా... తన చేతిలో ఏమీ లేదని చెప్పడం నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సైతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేక దృష్టి పెట్టినా ఏమాత్రం ఫలితం లేకుండా పోతుందని రోగులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.