కొవిడ్ బాధితులకు లభ్యమయ్యే పడకలు.. వైద్య సేవలకు సంబంధించి.. సమగ్ర సమాచారం తెలిసేలా... కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్.. డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. విషమంగా ఉన్న రోగులకు... మెరుగైన వైద్యం లభించేందుకు...ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
'ఎంజీఎంలో కరోనా రోగులకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం'
పరిస్థితి విషమించిన కరోనా రోగుల కోసం మెరుగైన వైద్యం అందించేలా వరంగల్ ఎంజీఎంలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం సన్నద్ధం చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రోగులందరికి 24 గంటలు ఆక్సిజన్ లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఎంజీఎం సూపరింటెండెంట్, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వరంగల్ ఎంజీఎం
ఆస్పత్రిలో ఆక్సిజన్, మందుల కొరత లేదని... అవసరమైన కొవిడ్ రోగులందరికీ...24 గంటలూ ఆక్సిజన్ లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. లాక్ డౌన్ ఫలితంగా...వచ్చే వారం తరువాత... ఉద్ధృతి తగ్గి.. ఆస్పత్రులపై భారం తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్న ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌తో ఈటీవీ ముఖాముఖి...
- ఇదీ చదవండి :నేడు వరంగల్ ఎంజీఎంకు ముఖ్యమంత్రి కేసీఆర్