హన్మకొండలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మేయర్... పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. కొంత దూరం వెళ్లగానే.. లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే లిఫ్ట్ ఆగిపోవటంతో మేయర్ అందులోనే చిక్కుకుపోయారు.
Warangal Mayor: అరగంటసేపు లిఫ్ట్‌లోనే మేయర్.. చెమటలు కక్కుతూ బయటకు.. - సాంకేతిక లోపం
ఆస్పత్రి ప్రారంభోత్సవం కోసం వెళ్లిన వరంగల్ మేయర్ గుండు సుధారాణికి లిఫ్ట్ రూపంలో అవాంతరం ఎదురైంది. పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా... సాంకేతిక లోపంతో మధ్యలోనే ఆగిపోయింది. అరగంట సేపు అందులోనే ఉండిపోయిన మేయర్.. సిబ్బంది శ్రమతో ఎట్టకేలకు బయటపడ్డారు.
సుమారు అరగంట పాటు మేయర్ లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. ఈ అనుకోని ఘటనతో హైరానా పడ్డ ఆసుపత్రి సిబ్బంది దాన్ని తెరిచేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత లిఫ్ట్ తెరుచుకోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ మేయర్ సుధారాణి.. ఒళ్లంతా చెమటలతో బయటకు వచ్చారు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అప్పటివరకు ఆందోళన పడ్డ ఆస్పత్రి సిబ్బంది.. హమ్మయ్య అనుకున్నారు. మేయర్‌కు కలిగిన అసౌకర్యానికి ఆస్పత్రి సిబ్బంది మేయర్‌కు క్షమాపణలు తెలిపారు.
ఇవీ చూడండి: