గ్రేటర్ వరంగల్ మేయర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇన్ఛార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లును ముఖ్యమంత్రి నియమించారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో బాలమల్లు సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయానికి కృషి చేస్తున్నారు. ప్రధానంగా పోటీ వ్యాపారవేత్త గుండా ప్రకాశ్, నాగమళ్ల ఝాన్సీ మధ్యే నడుస్తోంది. సీనియారిటీ పరిగణలోకి తీసుకుంటే ప్రకాశ్‌ను మేయర్ పదవి వరించనుంది. ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారమైతే ఝాన్సీకి దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రకాశ్ ఏకగ్రీవానికి అందరూ సహకరించాలని అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం.
నేడు వరంగల్ మేయర్ ఎన్నికపై వీడనున్న ఉత్కంఠ - jhansi
వరంగల్ నగర పాలక సంస్థ నూతన మేయర్ ఎన్నిక అధికార పార్టీకి సవాల్‌గా మారింది. ఏకగ్రీవం చేసేందుకు నేతలు ప్రత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సహకరించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చాయి.
వీడనున్న ఉత్కంఠ