వరంగల్ మహానగర పాలక సంస్థ 37వ డివిజన్ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. తనకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌కు లేఖ రాశారు.
తెరాసకు వరంగల్ కార్పొరేటర్ సాంబయ్య రాజీనామా - telanganan varthalu
వరంగల్ 37వ డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య తన పదవితో పాటు తెరాస సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు కార్పొరేటర్ లేఖ రాశారు.
తెరాసకు వరంగల్ కార్పొరేటర్ సాంబయ్య రాజీనామా
లేఖ ప్రతులను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులకు పంపినట్టు చెప్పారు. గ్రేటర్ వరంగల్‌కు త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం జరగడం పార్టీలో చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: ప్రపంచమే అబ్బురపడేలా సచివాలయ నిర్మాణం: ప్రశాంత్ రెడ్డి