complaint against dcc president: వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి తీరుపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు రేవంత్ రెడ్డి, మానిక్కం ఠాకూర్‌లను కలిశారు.
డీసీసీ అధ్యక్షునిపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల ఫిర్యాదు... ఎందుకో తెలుసా? - జనగామ తాజా వార్తలు
complaint against dcc president: జనగామ డీసీసీ అధ్యక్షుని తీరుపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తెరాసకు కోవర్ట్‌గా పనిచేస్తున్నారని, పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఆయనపై కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం తెరాస ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి పనిచేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెరాసకు కోవర్ట్‌గా పనిచేస్తున్నారని నాయిని వర్గం ఆరోపించింది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి వరంగల్ నియోజక వర్గంలో జోక్యం చేసుకోవడంపై మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు నియోజక వర్గాల్లో పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఆయనపై కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:రాజకీయాల్లో హుందాతనం కనిపించడం లేదు: ఎంపీ అర్వింద్