వరంగల్ నగరంలో పాజిటివ్ వచ్చిన వారి సంబంధీకులు 150 మందిని క్వారంటైన్ చేసినట్టు కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు లాక్డౌన్ను ఉల్లంఘించకుండా జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్పల్లి, మండీ బజార్, పోచమ్మమైదాన్ తదితర 15 ప్రాంతాల్లో ఇంటింటికీ కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని, ఇందుకోసం మున్సిపల్, మార్కెటింగ్, పోలీసు సిబ్బందితో 15 బృందాలు ఏర్పాటు చేశామంటున్న పమేలా సత్పతితో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి..
'నగరమంతా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం చల్లుతున్నాం' - వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి ఇంటర్వ్యూ
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం వరంగల్ నగరపాలక సంస్థ అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. 58 డివిజన్ల పరిధిలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో శానిటైజింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. లాక్డౌన్తో కలిగే ప్రజల ఇబ్బందులను తొలగించగలుగుతున్నామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి అన్నారు.
'నగరమంతా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం చల్లుతున్నాం'