ప్రభుత్వ ఆదేశాల అనుసారం రాష్ట్రంలో పలు ఆలయాలు, జన సమ్మర్ద ప్రదేశాలు మూసివేస్తున్నారు. వరంగల్లో నిత్యం పూజలందుకునే భద్రకాళి దేవాలయాన్ని కూడా మూసేశారు.
వరంగల్ భద్రకాళి ఆలయం మూసివేత - Corona News
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండడానికి రాష్ట్రంలో పలు ఆలయాలు మూసేస్తున్నారు. ఆ క్రమంలో వరంగల్లోని భద్రకాళి ఆలయాన్ని మూసేశారు.
వరంగల్ భద్రకాళి ఆలయం మూసివెత
నగరంలోని భద్రకాళి ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం, రామలింగేశ్వర స్వామి ఆలయాలకు కూడా తాళం వేశారు. దేవాలయాలు మూసివేయడం వల్ల భక్తులు బయటి నుంచే మొక్కులు చెల్లించుకొని తిరిగి వెళ్లారు.
ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'