వరంగల్లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు - warangal news
విశ్వకర్మ జయంతి సందర్భంగా వరంగల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలగాలని కోరుతూ హోమాలు చేశారు.

vishwakarma jayanti celebrations in warangal
వరంగల్ పట్టణంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వకర్మ వీధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన విశ్వకర్మ వసతి భవనాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలగాలని కోరుతూ హోమాలు చేశారు. వేడుకల్లో మాజీ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో విశ్వకర్మలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.