వేయి స్తంభాల గుడిలో ఘనంగా వినాయక ఉత్సవాలు - వినాయక చవితి వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్విహించారు.
![వేయి స్తంభాల గుడిలో ఘనంగా వినాయక ఉత్సవాలు vinayaka chavithi celebrations grandly started in thousand piller temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8516551-461-8516551-1598091675588.jpg)
వేయి స్తంభాల గుడిలో ఘనంగా వినాయక ఉత్సవాలు
వరంగల్ అర్బన్ జిల్లాలో వినాయక చవితి వేడుకలు... కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి, ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకున్నట్టు చెప్పారు. అందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.