ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఎలాంటి పనులు నిర్వహించాలన్నా జేసీబీ, డోజర్ నిర్వాహకులు అనుమతులు తప్పక తీసుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ స్పష్టం చేశారు. వివాదాలకు కారణమవుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో తవ్వకాలను అరికట్టేందుకు వర్ధన్నపేట సర్కిల్ పరిధిలోని డోజర్, జేసీబీ నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పని ఏదైనా అనుమతి తప్పనిసరి: ఏసీపీ - డోజర్, జేసీబీ నిర్వహకులకు ఏసీపీ రమేశ్ అవగాహన
వర్ధన్నపేట సర్కిల్ పరిధిలో డోజర్, జేసీబీ నిర్వహకులకు ఏసీపీ రమేశ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఎలాంటి పనులు నిర్వహించాలన్నా జేసీబీ, డోజర్ నిర్వాహకులు అనుమతులు తప్పక తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎలాంటి పనులు నిర్వహించాలన్నా అనుమతులు తప్పనిసరి: ఏసీపీ
ప్రభుత్వ భూములు, ఇతర స్థలాల్లో మట్టి తరలించడానికి ముందుగా సంబంధిత అధికారుల ఆదేశాలు తప్పని సరిగా ఉండే విధంగా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి డోజర్, జేసీబీకి ఆర్సీ, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు డ్రైవర్‌కు లైసెన్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇవీ చూడండి:పేదరికంలో కూరుకుపోయిన 135 కోట్ల మంది బాలలు!