తెలంగాణ

telangana

ETV Bharat / city

దేవునూర్​లో పిడుగు పడి రెండు ఎద్దులు మృతి - warangal urban district news

పిడుగు పడటం వల్ల రెండు ఎద్దులు మరణించిన ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లా ధర్మసాగర్​ మండలం దేవునూర్​ గ్రామంలో జరిగింది. ప్రభుత్వం ఘటనపై స్పందించి.. తనను ఆదుకోవాలని యజమాని కోరుతున్నారు.

Two bulls died in a lightning strike in Devanur
దేవునూర్​లో పిడుగు పడి రెండు ఎద్దులు మృతి

By

Published : Oct 9, 2020, 12:37 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా ధర్మసాగర్​ మండలం దేవునూర్​ గ్రామంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన వల్లిగె రామారావు అనే రైతు రాత్రి తన ఎడ్లను ఇంటికి సమీపంలో కట్టేశాడు. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి ఎడ్లపై పిడుగు పడింది.

ఈ ఘటనలో రెండు ఎద్దులు అక్కడికక్కడే మరణించాయి. వీటి విలువ రూ. 80 వేల పైనే ఉంటుందని రైతు రామారావు అన్నారు. ప్రభుత్వం ఘటనపై స్పందించి తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.

ఇదీ చదవండిఃభాగ్యనగరిలో 10లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు..!

ABOUT THE AUTHOR

...view details