వరంగల్ పట్టణ జిల్లా కేంద్రంలో తెరాస శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస హవా కొనసాగడం వల్ల ఆ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఎంపీటీసీ ఫలితాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం వల్ల కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎక్కువ శాతం అధిక స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు.
వరంగల్లో తెరాస కార్యకర్తల సంబురాలు - ZPTC
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అధిక స్థానాల్లో గెలుపొందింది. వరంగల్ పట్టణ జిల్లా కేంద్రంలో గులాబీ పార్టీ కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
వరంగల్లో అంబరాన్నంటిన తెరాస కార్యకర్తల సంబురాలు