ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులతో పాటు సిబ్బందికి ఓటు నమోదుపై అవగాహన కల్పించారు.
ఓటరు నమోదుపై ఎంజీఎం ఆసుపత్రిలో కోదండరాం అవగాహన - warangal district latest news
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులతో పాటు సిబ్బందికి పట్టభద్రుల ఎన్నికలకు ఓటు నమోదుపై తెజస అధ్యక్షులు కోదండరాం అవగాహన కల్పించారు.
ఓటరు నమోదుపై ఎంజీఎం ఆసుపత్రిలో కోదండరాం అవగాహన
అనంతరం ఆసుపత్రి కార్యనిర్వాహణ అధికారి నాగార్జునరెడ్డితో ఆయన భేటీ అయ్యారు. పట్టభద్రుల ఓటరు నమోదు గడువు దగ్గరపడుతున్న వేళ ఓటరు నమోదును ముమ్మరం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు ఎన్నికలు కీలకంగా మారతాయని ఆయన అన్నారు.
ఇదీ చూడండి:తెలంగాణ పోలీసులకు స్కోచ్ బంగారు పతకం