కాళేశ్వరం దైవ దర్శనానికి వెళ్లిన 20 నిముషాల్లోపే ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. దుండగులు బీరువాలో దాచిన 19 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుమారపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మధ్యలోనే తిరిగి వచ్చి బోరుమన్నారు.
దర్శనానికి వెళ్తే దొంగలు పడ్డారు.. - theft in house as family went for kaleshwaram trip at hanmakonda
దైవ దర్శనానికని ఆ కుటుంబమంత కాళేశ్వరం బయలుదేరింది. బయటకు వెళ్లిన 20 నిమిషాల్లోపే ఇంట్లో చోరబడ్డ దొంగలు 19 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. హన్మకొండలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హన్మకొండకు చెందిన దేశిని కళావతి తన చిన్న కూతురితో కలిసి తెల్లవారు జామున 5 గంటలకు కాళేశ్వరం దైవ దర్శనానికి బయలుదేరింది. ఉదయం పాలు పోసే వ్యక్తి వచ్చే సరికి తాళాలు తీసి ఉండటాన్ని గమనించి కళావతి కుమారుడికి సమాచారం ఇచ్చాడు. పక్క వీధిలో ఉంటున్న కుమారుడు వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. జాగిలాలతో చుట్టూ పక్కల పరిసరాలను పరిశీలించారు. తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: 'వ్యక్తిగత గోప్యత సురక్షితంగా ఉంచాలి'