తెలంగాణ లాక్డౌన్ కారణంగా జిల్లాలో జనసంచారం చాలావరకు తగ్గింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం బ్యారేజీ అంతరాష్ట్ర వంతెనను పోలీసులు మూసేశారు. జిల్లాలోని మహదేవపురం, పలిమెల, మలహార్, మహామత్తారం, కాటరం మండలాల్లో లాక్డౌన్ పూర్తిగా అమలు చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల ఆ రాష్ట్ర సరిహద్దులు మూసేసి ఎలాంటి వాహనాలు, రాకపోకలు లేకుండా నిలిపేశారు.
బయట తిరగొద్దు
మేడిగడ్డ బ్యారేజీలో సీఆర్పీఎఫ్ పోలీసులు క్యాంపు వేసి పహారా కాస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం జనాలు నిర్ణీత సమయంలోనే బయటకు రావాలని, ప్రజలు బయట తిరగొద్దని కాటారం డీఎస్పీ బోనాల కిషన్, మహదేవపురం ఎస్సే బెల్లం సత్యనారాయణ హెచ్చరించారు.