లాక్‌డౌన్ కారణంగా వేతనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ (టాప్టా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు ముకుందం ఆధ్వర్యంలో హన్మకొండ అదాలత్ కూడలిలోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.
ఇబ్బందుల్లో ఉన్నాం.. ప్రభుత్వమే ఆదుకోవాలి: టాప్టా - హన్మకొండలో ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అదాలత్ కూడలిలో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. లాక్డౌన్తో వేతనాల్లేక ఇబ్బంది పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇబ్బందుల్లో ఉన్నాం.. ప్రభుత్వమే ఆదుకోవాలి: టాప్టా
లాక్‌డౌన్ కారణంగా ఫీజులు వసూలు కాలేదనే సాకుతో పాఠశాల యాజమాన్యాలు కూడా తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున తమను ఆదుకోవాలని గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మానవతా దృక్పథంతో తమను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేత..!