అట్టహాసంగా రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు - వరంగల్
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో రాణించిన క్రీడాకారులు జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు
రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలో ఈతకొలనులో రెండు రోజులపాటు జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికలకు ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 450 మంది పాల్గొన్నారని... ఇందులో రాణించిన క్రీడాకారులు త్వరలో జరగబోయే జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.