తెలంగాణ

telangana

ETV Bharat / city

పటిష్ఠ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్​కు బ్యాలెట్ బాక్సులు - zptc mptc

వరంగల్​ అర్బన్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ఠ బందోబస్తుతో పోలీసులు స్ట్రాంగ్ రూములకు తరలించారు.

స్ట్రాంగ్ రూమ్​కు బ్యాలెట్ బాక్సులు

By

Published : May 7, 2019, 8:49 AM IST

వరంగల్ అర్బన్ జిల్లాలోని నాలుగు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హసన్పర్తి, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో 4 జడ్పీటీసీలు, 49 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన అనంతరం పోలీసులు పటిష్ఠ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను ఖాజీపేటలోని రాంపూర్ వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లోకి తరలించారు. జడ్పీ సీఈవో విజయ్ గోపాల్, ఏసీపీ నరసింహారావు కళాశాల వద్దకు చేరుకుని బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్​లకి తరలించే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు.

స్ట్రాంగ్ రూమ్​కు బ్యాలెట్ బాక్సులు

ABOUT THE AUTHOR

...view details