రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సారిగా వరంగల్‌కు వచ్చిన ఆయనకు... మేయర్ గుండా ప్రకాష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరిత హోటల్లో మొక్కలు నాటారు.
'రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు' - తెలంగాణ పర్యాటక శాఖ తాజా వార్తలు
దేశ, విదేశీ పర్యటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఆ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన వరంగల్ వచ్చారు.
'రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు'
వరంగల్‌తో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. నగరంలో వడ్డెపల్లి చెరువులో త్వరలోనే బోటింగ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ స్వగ్రామం వంగరను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. లక్నవరంలో మూడో వంతెన పనులకు కోటి రూపాయలు కేటాయించినట్లు శ్రీనివాస్ గుప్తా తెలిపారు.
ఇదీ చూడండి:హెల్ప్‌లైన్ వ్యవస్థలపై అవగాహన ఉండాలి : స్మితాసబర్వాల్