తెలంగాణ

telangana

ETV Bharat / city

భద్రకాళి ఆలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు - sri krishnastami

శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని వరంగల్​లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని కృష్ణుడి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు.

భద్రకాళి ఆలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
భద్రకాళి ఆలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

By

Published : Aug 12, 2020, 4:37 AM IST

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దేవ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా అమ్మవారిని కృష్ణుడి అలంకరణలో అందంగా అలంకరించారు. మురళీ కృష్ణుని అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులుతీరారు. అంతకు ముందుగా అమ్మవారికి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు.


ఇవీ చూడండి: నీటిపారుదల రంగం ఇకపై జలవనరుల శాఖ: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details