ప్రపంచంలోని అన్ని దేశాల్లో వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వ్యాధి పట్ల ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సోకకుండా కాపాడొచ్చనే అవగాహనా కార్యక్రమాలు కూడా పెరిగాయి.
కరోనాపై పాట రాసిన జనగామ కళాకారుడు - Special Song On Karona Written By Janagama Shankar
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ కళాకారుడు పాట రూపొందించాడు.
కరోనాపై పాట
కరోనా గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా పాట రూపంలో ప్రచారం చేస్తున్నాడు జనగామ సాంస్కృతిక సారథికి చెందిన జనగామ శంకర్. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతతో కరోనా రాకుండా అరికట్టొచ్చని పాట ద్వారా సూచిస్తున్నాడు.
ఇదీ చూడండి : పాండవుల గుట్టల్లో కలెక్టర్ రాక్ క్లైంబింగ్
TAGGED:
కరోనాపై పాట