కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని చారిత్రక శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖిల్లా వరంగల్లోని స్వయంభు శివాలయంలోని అర్చకులు పరమశివునికి రుద్రాభిషేకంతో పాటు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
కార్తీక సోమవారం... శివాలయాలకు పోటెత్తిన భక్తులు - warangal karthika monday latest news
వరంగల్ జిల్లా కేంద్రంలోని చారిత్రక శివాలయాలు మొదటి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివెళ్లి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు
పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. బక్తుల శివన్నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఇదీ చదవండిఃయాదాద్రిలో కార్తీక శోభ... రోజుకు ఆరు బ్యాచ్‌లకు అనుమతి