తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రభుత్వం త్వరగా రెండో విడత గొర్రెల పంపకాన్ని చేపట్టాలి'

రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని డిమాండ్​ చేస్తూ వరంగల్​ అర్బన్​ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ గ్రామంలో కరీంనగర్​- వరంగల్​ జాతీయ రహదారిపై గొల్ల, కురుమ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

shepherds protest on second phase sheep distribution at warangal
'ప్రభుత్వం త్వరగా రెండో విడత గొర్రెల పంపకాన్ని చేపట్టాలి'

By

Published : Oct 12, 2020, 7:07 PM IST

తెలంగాణ ప్రభుత్వం.. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ చేస్తామని చెప్తే అనేక మంది డీడీలు కట్టి మూడేళ్లు గడుస్తున్నా.. పంపిణీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు వెంటనే న్యాయం చేయాలంటూ వరంగల్​ అర్బన్​ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో కరీంనగర్ - వరంగల్​ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

సీఎం డౌన్​డౌన్​ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ నిలిచిపోవడం వల్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గొల్ల, కురుమల కులస్తులకు నచ్చజెప్పగా ఆందోళనను విరమించుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమపై దయ చూపి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని వేడుకున్నారు.

ఇదీ చదవండిఃవరంగల్​ - ఖమ్మం జాతీయ రహదారిపై గొల్లకురుమల రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details