తెలంగాణ

telangana

ETV Bharat / city

న్యాయవాదులు కోర్టుకు రాకుండానే కేసుల పరిష్కారం - హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్

వరంగల్​లో మొబైల్ కోర్టు​ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​.చౌహాన్ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. కరోనా కారణంగా కేసుల పరిష్కరానికి న్యాయవాదులు కోర్టుకు రాకుండానే ఆన్​లైన్​ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. పిటిషన్ వంటి వాటిని సమర్పించడం చేయవచ్చని ఆయన వివరించారు.

Settlement of cases without coming to court at mobile court warangal
న్యాయవాదులు కోర్టుకు రాకుండానే కేసుల పరిష్కారం..

By

Published : Jun 29, 2020, 6:26 PM IST

వరంగల్​లో మొబైల్ కోర్టు​ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఆన్​లైన్​ ద్వారా న్యాయమూర్తులు కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ మేరకు నాలుగు మొబైల్ కోర్టు​లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి ద్వారా న్యాయవాదులు కేసులకు సంబంధించిన విషయాలను కోర్టుకు రాకుండా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. తమ దగ్గరలోని మొబైల్ కోర్టు కేంద్రం నుంచి ఆన్​లైన్​లో న్యాయ మూర్తులతో కేసులకు సంబంధించిన విషయాలు పంచుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

కోర్టుకు రాకుండానే కేసుల పరిష్కారం..

ఇదీ చూడండి :పెట్రో ధరలపై సైకిలెక్కి జగ్గారెడ్డి వినూత్న నిరసన

ABOUT THE AUTHOR

...view details