వరంగల్ ఎంజీఎం వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. గత ఆరు నెలల క్రితం బెల్లంపల్లి శాంతి కాలనీకి చెందిన రాజాం అనే 65 ఏళ్ల వృద్ధుడు అల్సర్ వ్యాధితో ఆస్పత్రిలో చేరడంతో.. వైద్యులు పరీక్షించి శస్త్ర చికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు కడుపులోనే కత్తెరను మర్చిపోయారు. కుట్లు వేసి డిశ్ఛార్జి చేశారు.
కడుపులో కత్తెర.. ఆపరేషన్ చేసి మర్చిపోయిన డాక్టర్లు - warangal mgm hospital updates
అల్సర్ వ్యాధి వచ్చింది. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆరు నెలలు అయ్యింది. ఆ వ్యక్తి కోలుకోవాల్సింది పోయి.. తరచూ కడుపునొప్పికి గురవుతున్నాడు. ఏం జరిగిందో అని మళ్లీ వైద్యులను సంప్రదించాడు. పరీక్షించిన డాక్టర్లు అవాక్కయ్యారు. హుటాహుటిన ఆ వ్యక్తికి మరోసారి శస్త్ర చికిత్స నిర్వహించగా అసలు విషయం బయటపడింది. వైద్యుల నిర్లక్ష్యాన్ని తెలిపే ఆ ఉదంతాన్ని తెలుసుకుందామా!

తరచుగా కడుపు నొప్పి రావడంతో తిరిగి ఎంజీఎం ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వైద్యులు చికిత్స నిమిత్తం ఎక్స్-రే తీయగా అసలు విషయం బయటపడింది. గతంలో శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు నిర్లక్ష్యంగా కడుపులోనే కత్తెర మర్చిపోవడంతో సమస్య తలెత్తిన్నట్లు గుర్తించారు. హుటాహుటిన రాజాంకి మరోసారి శస్త్రచికిత్స నిర్వహించి కత్తెర బయటకు తీశారు. ప్రస్తుతం రాజం పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి కార్యనిర్వాహణాధికారి నాగార్జునరెడ్డి తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి:ఏనుగు మీద నుంచి కిందపడ్డ రామ్‌దేవ్ బాబా