తెలంగాణ

telangana

ETV Bharat / city

RS Praveen kumar meet KU Students: 'పేదలు చదువుకుంటే ప్రశ్నిస్తారనే భయం పాలకులకు పట్టుకుంది' - కేయూలో ఆర్​ ప్రవీణ్​కుమార్​

RS Praveen kumar meet KU Students: విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే రాజకీయాల్లోకి వచ్చానని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​ అన్నారు. పేదలు చదువుకుంటే ప్రశ్నిస్తారనే భయం పాలకులకు పట్టుకుందని విమర్శించారు.

RS Praveen kumar meet KU Students
RS Praveen kumar

By

Published : Dec 22, 2021, 5:46 AM IST

RS Praveen kumar meet KU Students: తెరాస ప్రభుత్వం ప్రైవేటు యూనివర్శిటీలకు మేలు చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ ఆరోపించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులతో భేటీ అయ్యారు. కేయూ విద్యార్థులు పలు సమస్యలను ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్​ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు చదువకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పేదలు చదువుకుంటే ప్రశ్నిస్తారనే భయం పాలకులకు పట్టుకుందన్నారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. విద్యా, వైద్యం, స్వయం ఉపాధి కల్పించడం కోసం.. పాలకులపై బీఎస్పీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

RS Praveen kumar meet KU Students: 'పేదలు చదువుకుంటే ప్రశ్నిస్తారనే భయం పాలకులకు పట్టుకుంది'

ఇదీచూడండి:CM KCR in Christmas Celebrations: 'అర్థం చేసుకుంటే.. అనుభవిస్తే ఇండియా బెస్ట్ దేశం'

ABOUT THE AUTHOR

...view details