నగరపాలక సంస్థ పరిధిలో 66 డివిజన్లు ఉండగా, 10 స్థానాల్లో రౌడీషీటర్లు బరిలో ఉన్నారు. కొంతమంది ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉండగా, కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రౌడీషీటర్లకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల.. వారు మరో రాజకీయ పార్టీలో చేరి పోటీ చేస్తున్నారు. పలువురు హత్యకేసుల్లో నిందితులుగా ఉన్న వారు, దోపిడీలు ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారు సైతం పోటీలో ఉన్నారు.
గ్రేటర్ వరంగల్ బరిలో రౌడీషీటర్లు - greater warangal elections updates
రాజకీయం, రౌడీయిజం కలిశాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో పలువురు రౌడీషీటర్లకు కార్పొరేటర్లుగా ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయించాయి. వారిని ప్రజలు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే పలువురు రౌడీషీటర్లు కొంతమంది ప్రజాప్రతినిధుల నీడలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు.
గ్రేటర్ వరంగల్ బరిలో రౌడీషీటర్లు
పోలీసు రికార్డులను బట్టి ఒక పార్టీ ముగ్గురు రౌడీషీటర్లకు టికెట్లు కేటాయిస్తే మరో పార్టీ నలుగురికి కేటాయించింది. మరో పార్టీ ఇద్దరికి కేటాయించగా, స్వతంత్రులుగా ఇద్దరు బరిలో ఉన్నారు. రౌడీషీటర్లపై మోపిన ఆరోపణలు కోర్టులో రుజువయ్యేంతవరకు పోటీ చేయవచ్చు. ప్రస్తుతం పోటీ చేస్తున్న వారిలో ఎవరైనా గెలిచాక కోర్టు వారిపై నేర నిర్ధారణ చేస్తే పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.